రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకులకు ఏ మాత్రం కొదవ లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో బాగా ఫైర్‌తో ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతలు ఎక్కువగానే ఉన్నారు. తమ పార్టీకి సపోర్ట్‌గా ఉంటూ, ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే వెంటనే రివర్స్ అయ్యి, వారికి గట్టి కౌంటర్లు ఇస్తుంటారు. ఇలాంటి ఫైర్ బ్రాండ్ నాయకులు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో ఎక్కువగానే ఉన్నారు.

అలాగే కొందరు మహిళా నేతలు పార్టీ కోసం గట్టిగానే కష్టపడతారు. అయితే పార్టీ కోసం కష్టపడుతున్న ఇద్దరు మహిళా నేతలనీ టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాళ్ళుగా గుర్తింపు తెచ్చుకున్న పంచమర్తి అనురాధా, దివ్యవాణిలకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటీవల చంద్రబాబు పార్టీలో పదవుల పంపకం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా పురుష, మహిళా అధ్యక్షులని, సమన్వయకర్తలని నియమించిన బాబు, తాజాగా ఏపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షులతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, పొలిట్‌బ్యూరో, అధికార ప్రతినిధులు, ఇతర పదవులని భర్తీ చేశారు.

అయితే వీటిల్లో ఏ పదవులోనూ అనురాధా, దివ్యవాణిలకు బాబు అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే ఏపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వంగలపూడి అనితనే మళ్ళీ పొలిట్‌బ్యూరోలో తీసుకున్నారు గానీ, అనురాధా, దివ్యవాణిలకు అధికార ప్రతినిధులగా కూడా అవకాశం ఇవ్వలేదు. టీడీపీలో గట్టి వాయిస్ వినిపిస్తున్న నేతల్లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ముఖ్యంగా అనురాధా ఎప్పటి నుంచో టీడీపీ కోసం కష్టపడుతున్నారు.

1995లోనే విశాఖ మేయర్‌గా పనిచేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఆమెకు ఎలాంటి కీలక పదవి దక్కలేదు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అనురాధాకు ఎమ్మెల్సీ పదవి తృటిలో మిస్ అయింది. అటు దివ్యవాణి సైతం పార్టీలో బలమైన వాయిస్ వినిపిస్తుంది. ఆమెకు కూడా బాబు వేరే పదవి ఇవ్వలేదు. మొత్తానికైతే ఇద్దరు ఫైర్‌బ్రాండ్‌లకు బాబు షాక్ ఇచ్చినట్లే కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: