ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జగన్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. చంద్రబాబు మరో ప్రాంతీయ పార్టీకి అధినాయకుడు. ఇద్దరి మధ్యన పోరు తీవ్రస్థాయిలో ఉంది. ఒకరి పార్టీని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటేనే రాజకీయంగా మనగలుగుతామన్న భావన ఉంది. దాంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తాడని చంద్రబాబుకు పేరు. దాంతో ఆయన అన్ని విధాలుగా జగన్ పాలనను ఎక్కడ వీలు అయితే అక్కడ అడ్డుకుంటున్నారు.  దాంతో అసహనానికి గురి అయిన ముఖ్య మంత్రి జగన్ ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏకంగా ఒక సీనియర్ న్యాయమూర్తి మీదనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాశారు. ఇపుడు అది జాతీయ స్థాయిలో పెద్ద చర్చగా ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ కి ఇపుడు గడ్డు రోజులు న‌డుసున్నాయని జాతకాలు చూసే పండితులు అంటున్నారు. ఆయన గత కొంతకాలంగా ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది అమలు కాకపోగా తిప్పుకొడుతోంది. ఆయన రాజకీయంగా కూడా కొంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇపుడు జగన్ వేసిన తాజా స్టెప్ ఏ రకంగా కొంప ముంచుతుంది అన్న చర్చ అయితే వైసీపీలో  ఉంది. ఇవన్నీ చూస్తున్న జాతక పండితులు జగన్ కి మరో నెల రోజుల వరకూ మంచి రోజులు లేవు అంటున్నారు.

గ్రహ‌ సంచారం చూసినా కూడా ఇపుడు ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు ఇక జగన్ కి నవంబర్ 23 నుంచి మంచి రోజులు వస్తాయని కూడా చెబుతున్నారు. నవంబర్ 23 తరువాత జగన్ కి కాలం కలసివచ్చి ఆయన అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని అంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కూడా తొలగిపోతయని కూడా చెబుతున్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా అయినా దానికి సమానమైన ప్యాకేజి అయినా కూడా ఏపీకి జగన్ తెస్తారని, అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి మంచి రోజులు వస్తాయని, కేంద్రం అండగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ గడ్డు రోజులను జగన్ సహనంతో దాటాలని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: