ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. నిన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరం ఇంకా కోలుకోలేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే వరద లో చిక్కుకొని పోయిన చాలా మంది ప్రాణాలను విడిచారు.. వరద మృతుల కుటుంబాలను పరామర్శించడానికి రాజకీయా నేతలు, కార్యకర్తలు వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వరద ప్రాంతాన్ని సందర్శించిన టీడీపీ నేత , మాజీ మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది.



ఈ నేపథ్యంలో నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించారు. వరద బాధితులను కలిసి బాధలను అడిగి తెలుసుకున్నారు. అయితే లోకేష్ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు దుమారం చేశారు. జగన్ పేరును ఉచ్చరిస్తూ టీడీపీ క్యాడర్ ను రెచ్చ గొట్టే విధంగా జై జగన్ ,జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం లోకేష్ పర్యటనలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ గొడవ కాస్త సర్దు మనిగింది.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.



ఈ విషయం పై లోకేష్ మాట్లాడుతూ.. వర్షాలతో సతమతమవుతున్న ప్రజలకు జగన్ భరోసా కల్పించకుండా హెలికాప్టర్ లో తిరుగుతున్నారు.మరోవైపు మంత్రులేమో అన్నదాతలను అవమానిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని ఎలా ఎదురు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు తప్ప వరదల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతు భరోసాలోను అన్నదాతలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ లో  రైతు లేని ప్రభుత్వాన్ని వైసీపీ కోరుకుంటుందని.. ఈ విషయం పై ప్రజలే బుద్ధి చెప్తారని లోకేష్ వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: