చైనా ఎప్పుడు ప్రతి విషయంలో డబుల్ గేమ్  ఆడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చైనా కు సంబంధించిన విద్యార్థులను ప్రొఫెషనన్స్  ని ఉద్యోగులను వివిధ దేశాలకు పంపించి అక్కడ చైనా వాదాన్ని విస్తరింప చేయాలని చైనా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ  ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. విదేశాలలో చైనా వాదాన్ని విస్తరించడమే కాదు విదేశాలకు సంబంధించిన రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారం  చైనా దొంగలిస్తూ ఎన్నో దారుణాలకు పాల్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి విషయాలు ఇటీవలే అమెరికా విచారణలో బయట పడ్డాయి.




 ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య ఇన్ని రోజుల వరకు ఉన్న కోల్డ్ వార్  కాస్త ఓపెన్ వార్ గా మారిపోయింది. చైనా కు సంబంధించిన విద్యార్థులు ఉద్యోగులు ప్రొఫెషనల్స్ అమెరికా కు సంబంధించినటువంటి రక్షణ సైబర్ విభాగాల్లో కూడా పనిచేస్తున్నారు. వీళ్లు అమెరికా కీలక  సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారు అన్న వ్యవహారం బయటపడింది. దీంతో  చైనా కు సంబంధించిన ఉద్యోగులను ప్రొఫెషనల్స్ కూడా కొంత మందిని అరెస్టు చేసి ఎన్నో ఆధారాలను స్వీకరిస్తుంది ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం అమెరికా రక్షణ రంగంలో సైబర్ విభాగంలో కీలక పదవులు లో ఉన్నటువంటి చైనా కు సంబంధించిన ప్రొఫెషనల్స్ ని గుర్తించి వారిని విచారిస్తుంది అమెరికా.



 విచారణలో ఎన్నో కీలక ఆధారాలు కూడా బయట పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చైనా డబుల్ గేమ్ ఆడుతూ.. ప్రపంచ దేశాలకు సంబంధించిన కీలక రహస్యాలను తెలుసుకునేందుకు నీచంగా  వ్యవహరిస్తుంది అన్న విషయం బయటపడితే ప్రపంచ దేశాల ముందు చైనా దోషిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది  చైనా. తాము కూడా తమ దేశంలో అమెరికాకు చెందిన ప్రొఫెషనల్స్  ఉద్యోగులను కూడా అరెస్ట్ చేస్తాం  అంటూ ప్రకటన చేయటం సంచలనంగా మారింది. ఒక రకంగా చైనా అమెరికా కు సంబంధించిన ప్రొఫెషనల్స్  ఉద్యోగులను కూడా బందిస్తాం  అంటూ చెప్పడం బ్లాక్ మెయిల్  చేయడమే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: