కరోనా  వైరస్ అనే ప్రాణాంతకమైన మహమ్మారిని తెరమీదకు తెచ్చి.. తమ దేశానికి కరోనా  వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని తమ దేశం కూడా ఒక బాధిత  దేశమే అంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది చైనా. ఇక ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన తరువాత ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అని నిజాలు చెప్పి ప్రపంచ దేశాలకు నమ్మకద్రోహం చేసింది. చైనాలో మాత్రం రెండు నగరాలకే కరోనా  ను  పరిమితం చేసి అక్కడి ప్రజలకు  మందులు ఇచ్చి ముందు జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా ప్రస్తుతం కరోనా  నియంత్రణ దేశంగా మారిపోయింది. ప్రస్తుతం కరోనా విషయంలో  చైనా నమ్మక ద్రోహం చేసింది అని భావిస్తున్న ప్రపంచ దేశాలు చైనా కు వరుసగా షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే అన్ని దేశాలు చైనా ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే భారత్ చైనా కు సంబంధించిన దిగుమతులను నిషేధించడం చైనా కు సంబంధించిన యాప్స్ నిషేధించడం కాంట్రాక్టుల రద్దు చేయడం చేసింది అమెరికా కూడా ఇదే తరహా నిర్ణయాలు తీసుకుంది.  మరికొన్ని దేశాలు కూడా చైనా కు సంబంధించిన కీలకమైన యాప్స్ అయినా పబ్జి టిక్ టాక్ బ్యాన్ చేశాయి. దీంతో ఆర్థికంగా చైనా ఎంతగానో కుచించుకుపోయింది అనే చెప్పాలి.



 ఇక ఈ క్రమంలోనే యాప్స్ కంటే ఎక్కువగా ఆర్ధికంగా చైనా ను దెబ్బ  తీసింది ఫైవ్ జి. ఫైవ్ జి సేవలను  ప్రపంచ దేశాలకు విస్తరించి అన్ని దేశాలు తమ గుప్పెట్లో పెట్టుకోవాలని భావించింది చైనా. ఈ క్రమంలోనే ముందుకు సాగుతున్న క్రమంలో జపాన్  తిరస్కరించడం.. బ్రిటన్ తోసిపుచ్చడం.. అమెరికా కొట్టిపారేయడం.. ఇండియా వద్దు అని చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు చైనా కు అత్యంత మిత్ర దేశాల లో ఒకటైన బ్రెజిల్ కూడా చైనాకు షాక్ ఇచ్చింది. చైనా కు సంబంధించిన ఫైవ్ జి నెట్వర్క్ ను  తిరస్కరించింది. చైనా కు సంబంధించన ఫైవ్ జీ  సేవలు అందించే హువాయ్  ని బ్యాన్  చేయబోతున్నట్లు బ్రెజిల్  ప్రకటించడంతో చైనా కు భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: