ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు పలు కీలకమైన పదవుల లో నియమించారు. అయితే ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ని కీలకమైన నాయకుడికి ఇస్తారన్న ప్రచారం ఈ మధ్యన జోరుగా సాగింది. అయితే మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నాయకులకు కట్టబెట్టారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఓ కీలకమైన బీసీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.


 తెలుగుదేశం పార్టీలో లో బి సి లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని దృష్టితో.. రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీ నాయకుడికి ఇచ్చామన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి అచ్చం నాయుడు ఎంతో కీలకమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి పార్టీతో విడదీయరాని బంధం ఉంది. ఇదే కుటుంబం నుంచి సిక్కోలు ముద్దుబిడ్డ గా కింజరాపు ఎర్రన్నాయుడు నా పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని.. తెలుగుదేశం పార్టీకి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన మరణానంతరం ఆ బాధ్యతలను సోదరుడు అచ్చం నాయుడు తీసుకున్నారు.


మరికొన్ని కీలక పదవుల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా  మరోసారి నారా లోకేష్ ని, జాతీయ కార్యదర్శి వర్గానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ లో 25 మందిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ లో 31 మందిని పలు పదవులు నియమించారు.అయితే ఈ సారి పలు కీలక పదవుల్లో ఇతర ఆంధ్రా నాయకులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్  సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాల గా ను.. 56 కార్పొరేషన్ చైర్మన్ పదవులు నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: