కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందడంతో మళ్లీ టిఆర్ఎస్ లో సందడి వాతావరణం మొదలైంది. ఆమె చుట్టూ ఇప్పుడు తెలంగాణ తెలంగాణ రాజకీయం మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే కెసిఆర్ చుట్టూ కొంత మంది , ఆయన కుమారుడు కేటీఆర్ చుట్టూ కొంత మంది ఉండగా ఇప్పుడు కవిత చుట్టూ మరో పవర్ సెంటర్ ఏర్పాటయింది. కెసిఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లే అవకాశం ఉండడంతో, రానున్న రోజుల్లో కవిత పార్టీలో కీలకంగా మారుతారనే అభిప్రాయం పార్టీ జనాల్లో ఏర్పడడంతో, ఇప్పుడు ఆమె చుట్టూ కొంతమంది నాయకులు చేరి, అప్పుడే భజన కార్యక్రమం మొదలు పెట్టేసారు అట.


 గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత చాలా యాక్టివ్ గా ఉన్నారు. అంతకుముందు ఉద్యమ సమయంలోనూ కవిత యాక్టివ్ గానే ఉంటూ, టీఆర్ఎస్ పార్టీకి, తన తండ్రి కెసిఆర్ కు ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో పార్టీలో క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది . రానున్న రోజుల్లో తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతను తీసుకునే అవకాశం ఉండడంతో, పార్టీ వ్యవహారాలు మొత్తం  కవితకు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లుగా అప్పుడే నాయకుల్లో అభిప్రాయాలు ఏర్పడ్డాయి. 


పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పాలన మొత్తం కేటీఆర్ చూసుకోవడం ఇబ్బందికరం కావడంతో కవితను పార్టీలో యాక్టివ్ చేసే ఆలోచనలు కెసిఆర్ ఉండడంతో, ఇప్పటి నుంచే ఆమె చుట్టూ కొంతమంది నాయకులు చేరడం, ఆమెను పొగడ్తలతో ముంచెత్తడం , వంటి వ్యవహారాలకు తెరతీశారు. దీంతో కవిత వ్యవహారం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: