సంక్షేమ కార్యక్రమాల కోసం ఎప్పుడూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రజలకు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే, దీని వలన ఆర్థికంగా కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆర్థిక వ్యవస్థ చాలా వరకు ఇబ్బంది పడుతుంది. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఎలాగైనా సరే అమలు చేయాలని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చాలావరకు దారుణంగా ఉంది అనే భావన వ్యక్తమవుతోంది.

తెలంగాణలో కూడా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన అడ్డంకిగా మారే పరిస్థితి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీఎం జగన్ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పర్యాటక రంగం మీద సీఎం జగన్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి ఎక్కువగా అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యాటక రంగం ఎక్కువగా ఉంది. దీనితో ఇప్పుడు ఈ జిల్లాల మీద సీఎం జగన్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

అంతేకాకుండా విశాఖ జిల్లా మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అరకు ఏజెన్సీలో పరిస్థితులు పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అక్కడ సీఎం జగన్ ఎక్కువగా పెట్టుబడి పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది తెలియదు. అయితే ఏజెన్సీలో సాంకేతికపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో వాటిని అధిగమించి పర్యాటక రంగాన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాలను అనుసరించాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: