తెలంగాణలోతెలుగుదేశం అయిపోయినట్లే అనే భావన చాలా వరకు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీకి చాలా భవిష్యత్తు ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయి దాదాపుగా పదిహేను ఏళ్ళు దాటింది. అయినా సరే ఇప్పటివరకు ఏ విధంగా కూడా అనుకూల పవనాలు అనేవి లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలావరకు పార్టీ కోసం పని చేయడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులో కూడా కాస్త ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. పార్టీని తాము ఎన్ని విధాలుగా ముందుకు నడిపించాలని భావిస్తున్నా సరే పార్టీ నేతల నుంచి మాత్రం సరైన సహాయ సహకారాలు లేకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు బీజేపీ లోకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఖమ్మం, నల్గొండ నుంచి దాదాపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కూడా ఇప్పుడు బిజెపి ని నమ్ముకుని ఆ పార్టీలోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది తెలియదు. కానీ తాజాగా ఒక పదవిని తీసుకున్న ఒక నేత కూడా బీజేపీ లోకి వెళ్లి పోవడానికి రెడీ అవుతున్నారట. దీనితోనే చంద్రబాబునాయుడు ఆయనను ఆపటానికి ఆ పదవిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: