తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎన్నో విధాలుగా దెబ్బ కొట్టాలని భారతీయ జనతాపార్టీ ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అవన్నీ ఫలిస్తాయా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణలో మాత్రం ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడం అనేది భారతీయ జనతాపార్టీ కత్తిమీద సాము లాంటిదే. ఇక ఈ సందర్భంగానే కొంత మంది నేతలను తనవైపు తిప్పుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేసింది అనే వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించాయి. బీజేపీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కూడా ఆ పార్టీలోకి వెళ్లే సాహసం చేయరు. అయితే కొంతమందికి కేంద్రస్థాయిలో పదవులు ఇస్తామని బీజేపీ నేతలు స్పష్టమైన హామీలు కూడా ఇస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే కొంత మంది టిఆర్ఎస్ నాయకులు కూడా తమ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఒక ఎమ్మెల్యే కి జాతీయ స్థాయిలో పదవి ఇస్తామని హామీ ఇవ్వడం చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయనకు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. ఇప్పటికీ తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను కూడా బిజెపి లోకి తీసుకుని జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మాత్రం ఏ విధంగా కూడా అవకాశాలు లేవు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏ విధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ లోకి వెళ్లి ఆ పదవిని తీసుకుంటారు... ఆ పదవిని తీసుకుని ఆయన ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అనేది చూడాలి. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు కూడా ఇప్పుడు బీజేపీ తమ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: