హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యం లో తెర మీదికి వచ్చిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం లో ఇలాంటి పరిస్థితులా  అని అందరూ ఆశ్చర్య పోయారు. చిన్నపాటి వర్షానికే చిగురుటాకు లా వణికిపోయిన భాగ్య నగరం రహదారులన్నీ పెద్ద పెద్ద చెరువుల ను తలపిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇక   భారీ వర్షాల తో పలు ప్రాంతాలు జలమయం అయిపోతాయి. కానీ ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ నగర పరిస్థితి ఎంత దారుణంగా మారి పోతుంది అన్నది ఇటీవలే అందరూ కళ్లారా చూసిన విషయం తెలిసిందే.



 హైదరాబాద్ నగరం లోని అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయి దుర్భర జీవితాన్ని గడిపారు భాగ్యనగర వాసులు. ముఖ్యంగా ఎన్నో కాలనీలు జలదిగ్బంధం లో కి వెళ్లిపోయాయి. ఇక రహదారులు అయితే పెద్ద పెద్ద చెరువులను తలపించాయి. అయితే భారీ వరద నీరు పొంగి పొర్లిన నేపథ్యంలో ద్విచక్రవాహనాలు కార్లు అనే తేడా లేకుండా వరదల్లో  కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. ఇంటి ముందు నిలిపి ఉంచిన కార్లు.. మరోవైపు రోడ్లపై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోవటం  అది మనం కళ్లారా చూసాం.



 అయితే హైదరాబాదులో ఉన్న పరిస్థితిని కళ్లకు  కట్టినట్లు చూపించే ఓ  చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో ఎన్నో వాహనాలు కొట్టుకుపోయిన నేపథ్యంలో.. దీనికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఒకవేళ భారీ వర్షాలు వచ్చి  వరదలు వస్తే తన కారు వరదల్లో  కొట్టుకు పోకుండా ఉండేందుకు ఏకంగా  ఒక వ్యక్తి ముందు జాగ్రత్తగా తన కారుకు తాడు కట్టి ఉంచిన ఘటన ప్రస్తుతం అందరినీ నవ్వుకునేలా చేస్తుంది కొంతమందిని ఆలోచించేలా చేస్తోంది ఈ  ఫోటో.

మరింత సమాచారం తెలుసుకోండి: