దేశంలో ఈ ఏడాది వర్షాకాలంలో ఎంతో సమృద్ధిగా వర్షాలు కురిశాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది అందరూ రైతులు ఎంతో సంతోష పడిపోయి పంటలు వేశారు. ఇక వర్షాకాలం పూర్తయి ప్రస్తుతం శీతాకాలం వచ్చింది. ఇక రైతులందరూ వేసిన పంటలు కూడా చేతికి వచ్చాయి. కానీ భారీ వర్షాలు మాత్రం ఆగడం లేదు బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎన్నో రాష్ట్రాలు జల దిగ్బంధం లోకి వెళ్ళి పోతున్నాయి. ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరోవైపు.. వరదలతో కూడా ప్రజలందరూ పోరాటం చేయాల్సి వస్తుంది.




 ఇదిలా ఉంటే ప్రస్తుతం భారీ వర్షాలతో వణికిపోతున్న దేశ ప్రజానీకం మరికొన్ని రోజుల్లో చలితో వణికి పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో క్రమక్రమంగా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పడంతో ప్రస్తుతం ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. వాతావరణంలో లా నివా పరిస్థితులు ప్రబలుతున్నందున  ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత సాధారణం కావడంతో ఎంతో తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.



 రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికే భారీ వర్షాలతో దుర్భర జీవితాన్ని గడుపుతుంటే... ఇక రానున్న రోజుల్లో శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతుంది అని వాతావరణ శాఖాధికారులు  తెలిపిన నేపథ్యంలో ప్రజల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే చల్లటి ప్రదేశాలలో ఎక్కువగా కరోనా  వైరస్ వ్యాప్తికి కారణం అవుతాయి కాబట్టి... తీవ్రంగా చలి  పెరిగితే కరోనా  వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: