ఈ ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసిందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..

మరోవైపు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షంలో ఉన్నలు ఫీల్ అవుతున్నారు.. అందుకే తాను ముఖ్యమంత్రి పదవి లో ఉన్నానన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు.. మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి విషయంలో జగన్ ను చంద్రబాబు పెట్టిన ఇబ్బంది అందరికి తెలిసిందే.. మరోవైపు తన మనుషుల తో ప్రభుత్వం పై కేసులు వేసి పైశాచిక ఆనందం పొందారు.. తన అనుకూల మీడియాలో జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ పై మెచ్చే వేసే ప్రయత్నం చేశారు.. ఎన్ని చేసిన ప్రజల అండతో జగన్ సుపరిపాలన అందిస్తూ వారి దృష్టిలో దేవుడిగా నిలిచిపోతున్నాడు..

ఇక జగన్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంతో కొంత ప్రధాన పాత్ర వహించారని చెప్పొచ్చు.. ఓ బహిరంగ సభలో ప్రశాంత్‌ కిషోర్‌ను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హేళనగా మాట్లాడారు. ఎవరైనా వ్యూహకర్తను పెట్టుకుంటారా..? పెట్టుకుంటే మాత్రం బయటకు చెబుతారా..? అంటూ వైఎస్‌ జగన్‌ చర్యను ఎగతాళి చేశారు. కనీ ఇప్పుడు అదే వ్యూహాన్ని చంద్రబాబు పాటిస్తుండడం ఆశ్చర్యంగా ఉంది..ప్రశాంత్‌ కిషోర్‌ మాదిరిగా.. పంజాబ్‌కు చెందిన రాబిన్‌ శర్మ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. పార్టీలో పదవులు ఎవరికి ఇవ్వాలనేది కూడా రాబిన్‌శర్మ సర్వే చేసి చెప్పిన తర్వాతే.. చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: