ఇటీవల కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలమై తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు సాధారణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది హైదరాబాద్ నగరం. అతి భారీ వర్షం కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భారీ వర్షం లో తడిసి ముద్దై పోయింది హైదరాబాద్ నగరం. ఇక ఇప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలోని ఎన్నో ప్రాంతాలు వరదల నుంచి కోలుకోలేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పరిస్థితి అయితే మరింత తీవ్ర దుర్భర స్థితిని అనుభవిస్తున్నారు. వరద నీరు  మొత్తం ఇళ్లలోకి చేరడంతో కనీస ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు.




 అయితే ఇప్పటికే కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది... జనజీవనం స్తంభించిపోయింది తీవ్రంగా నష్టం వాటిళ్లింది.  ఇక రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయి అని అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నగర వాసులు అందరూ మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో వరదల నుంచి ఇంకా కోలుకోలేదు అప్పుడే మళ్లీ భారీ వర్షాలు అంటే ఇక తమ ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు భయపడి పోతున్నారు. అటు అధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.



 అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని... ఇక వరద ప్రభావిత ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండడం ఎంతో మేలు అంటూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో మళ్ళీ భారీ వర్షం మొదలైంది పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రస్తుతం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు... ఇక నేడు కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదల  నుంచి ఇంకా కోలుకోలేదు అంతలోనే మళ్లీ భారీ వర్షం పడి పలు  ప్రాంతాల మొత్తం జల దిగ్బంధంలో కి వెళ్లి పోతున్న తరుణంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు, ఇక భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన జిహెచ్ఎంసి అధికారులు ప్రజలందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: