ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ దుబ్బాక లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. అధికార , ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి  గ్రామస్థాయిలో నేతలను నియమించి ప్రచారానికి తెరలేపింది.. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా హరీశ్ రావును పార్టీ అధిష్టానం నియమించి అక్కడి స్థానంపై కన్నేసింది.. హరీశ్ రావు దుబ్బాక నియోజకరవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ప్రతిపక్షాలు సైతం ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు తమ అస్త్రాలను ఉపయోగిస్తుంది. బీజేపీ అయితే ఒకడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించే ఆలోచన చేస్తుంది. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు ఆయన్ని దుబ్బాకలో ప్రచారానికి వినియోగించుకోనున్నారు.. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన అక్కడ పోటీ చేశారు. గ్రామగ్రామన ఆయన అనుచరణగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.

ఈ రెండు పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక లో విజయ కేతనం ఎగురవేయడానికి ఓ ఎత్తుగడ వేసింది..  చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని టీఆరెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి మరీ కాంగ్రెస్ తరపున పోటీ చేయిస్తున్నారు.. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు అయినా శ్రీనివాస్ రెడ్డి కి నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరగణం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్ ఖరారు చేశారు. దాంతో అయన కాంగ్రెస్ లోకి వెళ్లి అక్కడినుంచి పోటీ చేస్తున్నారు.. ఈ క్రమంలో దుబ్బాక కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దుబ్బాక కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశించిన నరసింహారెడ్డి, మనోహర్ రావులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారో అని కొంత ఆసక్తి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: