ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ ఎంత సమర్థవంతంగా అమలు చేసిన సరే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోకపోతే మాత్రం ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే పెద్దగా ఉపయోగం ఉండదు అనే విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇప్పుడు వైసీపీ చాలా బలంగా ఉంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది కాబట్టి... ఇంకా ప్రజల్లోకి అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం అనేది పార్టీ నేతల మీద ఎంతైనా ఉంది.

అయితే ఇప్పుడు ప్రచారం విషయంలో మాత్రం వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కార్యకర్తలు చూపించిన హుషారుని నాయకులు చూపించలేకపోతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వెళ్లే విధంగా కార్యకర్తలు కష్టపడుతున్న సరే నాయకులు మాత్రం పెద్దగా ముందుకు రాకపోవడం ఎప్పుడు సీఎం జగన్ ని కూడా చాలావరకు ఇబ్బంది పెడుతోంది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల లోపు కార్యకర్తలు తో పాటుగా ప్రజల్లో కూడా వెళ్లే విధంగా అడుగులు వేయాలని ఆయన సూచిస్తున్నారు.

ఇక ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే విధంగా విమర్శలు చేస్తుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో తటస్థ ప్రజలను కూడా ఆకట్టుకోవాల్సిన అవసరమనేది అధికార పార్టీపై ఎక్కువగా ఉంది. మరి ఈ విషయంలో అధికార పార్టీ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. ఇక కొంతమంది మంత్రులు కూడా అసలు ప్రజల్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు అనే భావన వ్యక్తమవుతోంది. ఇన్ని రోజులు కరోనా కారణంగా ఇళ్లల్లోనే ఉండిపోయిన నాయకులు ఇప్పుడైనా సరే బయటకు రావాలని కార్యకర్తలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: