తెలంగాణలో బిజెపిని ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా కష్టపడుతున్న సరే... బీజేపీని విమర్శించే విషయంలో మాత్రం కొంత మంది నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు అనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇప్పుడు బీజేపీ అన్ని విధాలుగా తనను ఇబ్బంది పెట్టాలని భావిస్తుంటే సీఎం కేసీఆర్ చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. మంత్రి హరీశ్ రావు అదేవిధంగా మరో మంత్రి కేటీఆర్ ఇప్పుడు బీజేపీ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పార్టీలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే బిజెపి పై ఎదురుదాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కొంత మంది నేతలు బీజేపీ ని విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి అనేది తెలియదు కానీ బిజెపి ని విమర్శించే విషయంలో మాత్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు అనే భావన సీఎం కేసీఆర్ లో కూడా ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఆరోపణలు బీజేపీ నేతలు ఎక్కువగా చేస్తున్నారు.

అయినా సరే ఇబ్బంది పెట్టే విధంగా టిఆర్ఎస్ నేతల మాట్లాడకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సరే ఆ పార్టీ నేతలు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. అసలు బిజెపిని ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన మంత్రులు కూడా విమర్శించే సాహసం చేయకపోవడం గమనార్హం. మొన్నటివరకు మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ టార్గెట్ గా కాస్త ఎక్కువగా విమర్శలు చేసేవారు. అదేవిధంగా ఒకరిద్దరు ఎంపీలు కూడా కాస్త ఘాటుగానే మాట్లాడారు. అయినా సరే ఇప్పుడు కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శించే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: