కరోనా  వైరస్ కారణంగా విద్యారంగ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ తర్వాత అన్లాక్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో... ఇప్పుడిప్పుడే విద్యా సంస్థలు అన్నీ తెరచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వాలు శరవేగంగా ఇప్పటికే కరోనా  వైరస్ కారణంగా నిలిచిపోయిన వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షలను కఠిన నిబంధనల మధ్య నిర్వహించడంతో పాటు... నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే ప్రస్తుతం వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అటు విద్యార్థులు కూడా వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియలో ఏ కాలేజీలో చేరాలనే దానిపై ప్రస్తుతం నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు రంగంలోకి దిగి తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో ఆఫర్ లను కూడా ప్రకటించింది.  ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో... ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రస్తుతం ప్రచారాన్ని ప్రారంభించారు.



 ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినట్లు గానే  ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతూ ఇంటింటికి తిరిగి మా కాలేజీ లోనే చేరాలి అంటూ కోరుతున్నారు. కేవలం ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకుంటామని ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇక మరికొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీలో చేరితే ఏకంగా ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తానంటూ చెబుతున్నారూ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: