ఈమె కధ విన్న ప్రతీ ఒక్కరు కంట తడి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈమె డబల్ పీజీ చేసి యాచకురాలిగా మారింది. ఆమె ఎవరు..? పూర్తి  వివరాల్లోకి వెళితే... ఈమె సొంతూరు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సోమేశ్వర్ కు సమీపాన ఉండే రాంఖిలా గ్రామం. ఈమె తల్లిదండ్రులకి  మొత్తం ఐదుగురు పిల్లలు. వీళ్ళందరిలో  ఈమె  పెద్ద కుమార్తె. ఈమె  పేరు హన్సి. చిన్నప్పట్నుంచే ఈమె చదువులో ముందు ఉండేది. తండ్రి చిరుద్యోగి కావడంతో ఎంతో కష్ట పడి  వీళ్ళని చదివించడం జరిగింది.

తన  తండ్రి కష్టాలను  చూసిన హన్సి.. ఊరి నుంచి వెళ్ళిపోయి  కుమావున్ విశ్వవిద్యాలయానికి చేరింది. ఇలా ఆమె యూనివర్సిటీ లోకి చేరడం తో ఆమెపై ప్రతి ఒక్కరికి కూడా అంచనాలు పెరిగాయి. ఇలా హన్సి చక్కగా చదువుకోవడం తో పాటు   స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలిగా కూడా కొంత కాలం పనిచేసింది. ఇలా అంత బాగుంది అనుకునే సరికి మళ్ళీ కష్టాలు ఈమె చెంత చేరాయి.

హన్సి  కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్‌ టమ్‌టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఈమె గెలవలేకపోయింది. ఆ  తర్వాత ఈమెకి  పెళ్లి అయ్యింది కానీ ఏవో  గొడవలు కారణంగా వైవాహిక జీవితంలో గందరగోళం అయింది. ఇంకేం ఉంది హన్సీ ప్రహరి కొంతకాలం నిరాశకు గురైంది.  ఇలా ఆమె తర్వాత ధర్మనాగ్రిలో స్థిరపడి హరిద్వార్ చేరుకుంది.  కుటుంబం నుంచి విడిపోయి ఇప్పుడు తన కొడుకుతో కలిసి బతుకుతోంది. ఆమె పరిస్థితి, ఆరోగ్యం బాగోకపోవడంతో ఉద్యోగం కూడా చేయలేకపోతోంది ఈమె. 2012 నుంచి ఆమె.. తన ఆరేళ్ల బిడ్డతో కలిసి హరిద్వార్‌లో యాచించడం ద్వారా జీవనం కొనసాగిస్తుంది.  ఆమె కొడుకు బాగా చదువుకోవడం ఒక్కటే ఆమెకి మిగిలిన కోరిక. స్వయంగా ముఖ్యమంత్రికి అనేకసార్లు లేఖలు రాసింది కానీ ఫలితం లేదు. అలానే సాయం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ప్రభుత్వం సహాయం సహాయం అందలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: