బీసిల పార్టీగా తెలుగుదేశం మరోసారి రుజువైంది  అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సంస్థాగత కమిటీలలో బిసిలకు పెద్దపీట వేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తున్నామని అన్నారు. బీసిల పార్టీగా తెలుగుదేశం పార్టీ మరోసారి రుజువైంది. రెండు రాష్ట్రాలకు బీసీలే టిడిపి అధ్యక్షులని ఆయన పేర్కొన్నారు. టిడిపి అత్యున్నత నిర్ణాయక కమిటి పోలిట్ బ్యూరోలో 40% బీసిలే..పోలిట్ బ్యూరోలో 60% సభ్యులు బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలే అని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టిడిపి బీసిల పార్టీ అని స్పష్టం చేసారు.

4 దశాబ్దాల క్రితం ఏపిలో బిసిలపై దారుణమైన అణిచివేత ఉండేది అని అన్నారు. టిడిపి ఆవిర్భావం తర్వాతే బీసిలకు రాజ్యాధికారం అని  ఆయన చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయమే తెలుగుదేశం ఊపిరి అని అన్నారు. టిడిపి పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం అని అన్నారు. టిటిడి ఛైర్మన్లుగా బిసి(కళా వెంకట్రావు, పుట్టా సుధాకర్ యాదవ్)లను నియమించింది టిడిపినే అని అన్నారు.  ఇప్పుడు టిటిడి పాలకమండలిలో ఎటుచూసినా సీఎం జగన్ సామాజికవర్గమే అని ఆయన చెప్పుకొచ్చారు. ఛైర్మన్ ,ఈవో, జెఈవో,అందరినీ ఏరికోరి సొంత సామాజికవర్గంతో నింపేసిన చరిత్ర జగన్ ది అన్నారు.

వైసిపి 4ప్రాంతాల బాధ్యులుగా జగన్ సామాజికవర్గం వారే( విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లను సగానికి పైగా తగ్గించారు అని అన్నారు. 34%నుంచి తగ్గించి 17%కు తగ్గింపు, కొన్ని జిల్లాలలో 11%కూడా బిసిలకు ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. జగన్ ద్రోహం వల్లే వేలాది పదవులు బిసిలకు దూరం అయ్యారని అన్నారు. నిధులను దారిమళ్లించి బిసిలకు జగన్ నమ్మకద్రోహం..బిసి స్పెషల్ కాంపోనెంట్ నిధులు భారీగా మళ్లించారని అన్నారు. బిసి కాలనీల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు వైసిపి తూట్లు పొడిచింది అన్నారు. రోడ్లు, డ్రెయిన్లు, భవనాల నిర్మాణం హుళక్కే..13జిల్లాలలో బిసి భవన్ ల నిర్మాణం ఆపేశారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: