అవునూ.. అక్షరాల పది కోట్ల రూపాయల భారి విరాళం అందించింది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. ఆ విశేషాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్‌ వరద బాధితులకు సాయం అందించేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించి 10 కోట్ల విరాళం అందించింది మేఘా ఇంజనీరింగ్స్ సంస్థ. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు (గ్రామాల దత్తత) చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ మొన్నటికి మొన్న కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు భారి విరాళం అందించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌, జనరల్‌ సెక్రటరీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వచ్చారు. తమ రెండు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ మహానగరం ఫై వరణుడు పగపట్టినట్లు ఉంది. వరుసగా గత వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అది కూడా మాములు వర్షం కాదు..ఏకంగా కాలనీ లనే ముచ్చే భారీ వర్షం పడుతుంది. గత వారం దంచి కొట్టిన వర్షం నుండి ఇంకా నగర వాసులు బయటకు రాకముందే..మరోసారి భారీ వర్షం రాబోతుందని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ ప్ర‌క‌టించారు.
అయితే భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(MEIL) భారీ విరాళం ప్రకటించింది. వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. ఈ మేరకు మేఘా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: