హైదరాబాదులో ఇప్పుడున్న పరిస్థితి ఆధారంగా చూస్తే ఇప్పట్లో సాధారణ పరిస్థితులు వచ్చేటట్లు కనబడడంలేదు. హైదరాబాదులో ఇంకా కూడా వరద ముంపు లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఇక అధికార పార్టీ నేతలు కూడా హైదరాబాదులో సాధారణ పరిస్థితి తీసుకు రావడానికి అధికారులతో కలిసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అధికార పార్టీ నేతలు కూడా ప్రజలతో ఎక్కువగా ఉంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ప్రజల్లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.

దీనిపై టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా చాలావరకు సీరియస్ గా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసలు ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన సరే చాలా మంది నేతలు ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు వినే ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా దారుణం అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది.

అయినా సరే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనిపై తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అటు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు హైదరాబాదులో ఉన్న నేతలపై చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రజల్లోకి ఎందుకు వెళ్లడం లేదని ఆయన కొంత మంది నేతలకు నేరుగా ఫోన్ చేసి అడిగినట్లు కూడా తెలుస్తోంది. ఒకపక్కన అధికార పార్టీ నేతలు కష్టపడుతున్న విపక్షాలు గా ఉన్న మీరు ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని ఆయన చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: