గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం వరదల్లో  ముంచెత్తిన విషయం తెలిసిందే. గ్రామాలు పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో కి వెళ్లి పోయి  జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర ప్రజానీకం మొత్తం బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే జీవితం గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే వరదల నుంచి కోలుకున్నామని  ప్రజలందరూ కాస్త సంతోషపడుతున్న సమయంలోనే మళ్లీ భారీ వర్షాలు తెలంగాణ ప్రజలందరికీ ముంచెత్తడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.



 ఇక తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాటిల్లిన  నష్టం అంతా ఇంతా కాదు. వర్షాకాలం పూర్తయి శీతాకాలం ప్రారంభంలో సరిగ్గా పంట చేతికి వచ్చిన సమయంలో పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో మొత్తం పంట  నీటిలో మునిగిపోయి పూర్తిగా దగ్ధమైంది. దీంతో రైతులందరూ మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయారు అనే చెప్పాలి. అయితే దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం కారణంగా పంట నష్టం వాటిల్లిందని తెలంగాణ వ్యవసాయ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే.



 ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోతుంది.  నగరాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. మురికి నీరు వచ్చి ఇళ్లల్లో  చేరడంతో మురికి నీటి మధ్య దుర్భర జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వరదల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా 15 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. వరద సహాయక చర్యల కోసం ఈ ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలిపారు. కష్టకాలంలో అండగా ఉంటాను అంటూ తెలిపారు కేజ్రీవాల్. కాగా ప్రస్తుతం వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు తెలంగాణ కి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: