ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల విషయం లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఏకంగా విద్యార్థుల జీవితాలను అయోమయం లో పడినట్లుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతంలో తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్ ఫలితాల విషయంలో అధికారులు చేసిన పొరపాట్లు ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను కూడా బలి తీసుకున్నాయి. ఫెయిల్ అయ్యమనే  మనస్థాపంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.




 ఇక కరోనా  వైరస్ సంక్షోభం కారణంగా పూర్తిగా నిలిచిపోయిన విద్యా వ్యవస్థను మళ్ళీ పునః  ప్రారంభించి గాడిలో పెట్టే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యా సంస్థలను పునః ప్రారంభించేందుకు అనుమతులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంబిబిఎస్ ప్రవేశాల కోసం నీట్  పరీక్షలు నిర్వహించింది. కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య కఠిన నిబంధనల మధ్య ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే నీట్ పరీక్ష లకు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చాయి.



 అయితే ఎంబిబిఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది విద్యార్థులను పాస్ అయిన ప్పటికీ ఫెయిల్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. రాజస్థాన్ కు చెందిన రావత్  కు 329 మార్పులు వచ్చాయని ఎన్టీఏ  మార్కుల షీట్ విడుదల చేసింది. దీంతో తన మార్కులపై ఎంతో పట్టుదలతో ఉన్న సదరు విద్యార్థి.. ఫలితాలను సవాలు చేయగా ఓఎంఆర్ షీట్.. ఆన్సర్ షీట్ ను  కూడా పరిశీలించి ఆరువందల యాభై మార్కులు వచ్చినట్లుగా తేల్చారు. 650 మార్పులతో ఎస్ టి కోటాలో ఏకంగా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు రావత్ . దీంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: