జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు. ఇది ఆయనకూ వైసీపీకి కూడా బ్రాండ్ ఇమేజ్. దాన్ని నిలబెట్టుకోవడం ఆయన ఎంతదాకానైనా వెళ్తానని అంటున్నారు నిజానికి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జగన్ తొంబై శాతం హామీలను నెరవేర్చారు. ఇది నిజంగా కష్టసాధ్యమైన విషయం. కానీ జగన్ తాను అంటే ఏమిటో చేసి చూపించారన్నమాట. ఇక జగన్ ఇపుడు అతి పెద్ద కార్యక్రమమే చేపట్టారు.  బీసీల కోసం పెద్ద ఎత్తున కార్పోరేషన్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బీసీల జీవితాలు మెరుగుపడడం ఖాయం

అంతకంటే ముందు ఏంటంటే సామాజికంగా రాజకీయంగా వారిని అతి పెద్ద గౌరవం దక్కడం. దానితో పాటు ఆర్ధికంగా వారు ఒకరిపైన ఆధారపడకుండా ముందుకు సాగుతారు. 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు అంటే అతి పెద్ద వ్యవస్థ. ఎవరూ ఎక్కడా వినని కులాలు బీసీల్లో ఉన్నాయి. నిజానికి ఒక సర్వే ప్రకారం ఏపీలో 139 బీసీ కులాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ముప్పైవేల మంది జనాభాను ప్రమాణంగా తీసుకుని ఆయా కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 500 కంటే తక్కువ ఉన్న కులాలను కలిపి అత్యంత వెనకబడిన బీసీల కార్పోరేషన్ అన్నారు.

సరే ఇవన్నీ ఏర్పాటు అయ్యాయి. ఇందులో యాభై శాతానికి పైగా బీసీ మహిళలకు అవకాశాలు దక్కాయి. మరి ఇన్ని రకాలుగా బీసీలను సమాదరించిన ఘనత కచ్చితంగా జగన్ కే దక్కుతుంది. కానీ ఇక్కడే ఉంది తమాషా. ఈ కులాలు అన్నిటికీ ఆర్ధికంగా నిధులు ఇవ్వాలంటే చాలా భారమే అవుతుంది. వేలాది కోట్ల రూపాయలు వీటి నిర్వహణకు ఖర్చు చేయాలి. ఏపీ ఖజానా చూస్తే వెక్కిరిసోంది. మరి వీటి విషయంలో జగన్ కనుక నిధులు, విధులు నిర్ణయించి పట్టాలెక్కించకపోతే రేపటి రోజున అశపడ్డవారే ఎదురుదాడి చేసే ప్రమాదమూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ఆ ముచ్చట.



మరింత సమాచారం తెలుసుకోండి: