ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీ లో అమలు జరుగుతోంది అని ఆయన అన్నారు. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్లు ఏర్పాటు చేసాము  అని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులో ఉంచాము అని ఆయన వివరించారు. రికార్డు స్ధాయిలో దేవాలయాల సంబందించిన 306 కేసులను ఏపీ పోలీసు శాఖ ఛేధించింది అని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు ,ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్ తో మ్యాపింగ్ చేసాము అని ఆయన చెప్పారు. అంతర్వేది రధం ఘటన అనంతరం దేవాలయాలకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు. అందులో 27 కేసులు ఛేధించాము  అని ఆయన చెప్పుకొచ్చారు. తరచుగా నేరాలకు పాల్పడుతున్న 54  మంది పాత నేరస్ధులను గుర్తించాము  అని ఆయన అన్నారు. 130 మందిని అరెస్టుచేసి , 1196 మందిని బైండ్ ఓవర్ చేసాము  అని ఆయన తెలిపారు.

దిశా అప్లికేషన్ ని 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు అని తెలిపారు. ఎస్ఓఎస్ యాప్ ద్వారా 79,648 వినతులు వచ్చాయి అని ఆయన అన్నారు. 604 కాల్స్ పై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. 122 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి అని ఆయన వివరించారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ లు 2019లో 62 నమోదు కాగా, 2020 ఇప్పటి వరకూ 279 నమోదు అయ్యాయి అని ఆయన తెలిపారు. రాష్ట్రం లో నేరాల సంఖ్య 18 శాతం తగ్గిందని అయన అన్నారు. పోలీసుల కుటుంబాలలోని చాలామంది డాక్టర్లు కోవిడ్ సమయంలో సేవ చేసారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: