ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త తగాయి. ముందు ఆందోళన కలిగించినా సరే ఇప్పుడు మాత్రం దాదాపుగా అదుపులోకి వచ్చిన విషయం అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా కోవిడ్‌ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజుకు 70 వేల టెస్టులు చేస్తున్నాం అని ఆయన అన్నారు. పాజిటివిటీ రేటు 4.76 అని, వారం క్రితం 5.5 ఉండేది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో కోవిడ్‌ బాగా తగ్గుమఖం పడుతోంది అని ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. 10 శాతం కేసుల్లో కోవిడ్‌ వచ్చివెళ్లిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని సర్వేలో తేలింది అని అన్నారు.

కిడ్నీ సమస్యలు, హార్ట్, చెవుడు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి అని ఆయన అన్నారు. కోవిడ్‌ వచ్చిన తర్వాత 6 నుంచి 8 వారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారికి గుర్తు చేయాలన్నారు. ఇటువంటి కేసులను కూడా ఆరోగ్య శ్రీలోకి తీసుకురావాలని హెల్త్‌ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. వైద్యులు సరిపడా ఉన్నారా... మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. 104 కు డయల్‌ చేస్తేనే.. కచ్చితంగా అర్ధగంటలో బెడ్‌ అలాట్‌ చేసి, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఆసుపత్రిలో జాగ్రతలు తీసుకోవాలని స్పష్టం చేసారు.

వైద్యుల, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటడం వంటి నాలుగు అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌ ఉండాలి అని ఆయన కోరారు. ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో కూడా హెల్ప్‌ డెస్క్‌ తప్పనిసరి అని స్పష్టం చేసారు. రానున్న 15 రోజుల్లో ప్రతి ఆస్పత్రిలో ఉండాలి అని అన్నారు. హెల్త్‌ సెక్రటరీ దీన్ని మానిటరింగ్‌ చేయడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కూడా ధ్యాస పెట్టాలి అని సూచించారు. ఆరోగ్యమిత్రకు సరైన ఓరియంటేషన్‌ ఉండాలి. శిక్షణ ఉండాలన్నారు. 104 కాల్‌ సెంటర్‌పైనా మాస్క్‌లపైనా సోషల్‌ డిస్టెన్స్‌పైనా హేండ్‌ శానిటైజేషన్‌ పైనా అవగాహన చాలా అవసరమని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: