వర్షాలు, వరదల దెబ్బతో తెలంగాణా ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతుంది. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి హైదరాబాద్ లో ఉంది అనే చెప్పాలి. ఇక  తెలంగాణా సర్కార్ కూడా హైదరాబాద్ లో నానా కష్టాలు  పడుతుంది. ముంపు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లు పర్యటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బి ఎస్ మక్తా, బి ఎస్ మక్తా, హరి గేట్, రాజు నగర్ తదితర ప్రాంతాలలో బాధితులను కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా వరద ఉధృతికి ఇబ్బంది ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు పది వేల నగదు సాయం అందజేశారు. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ... అల్పపీడనం కారణంగా మహా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. సుమారు వందేళ్ల తర్వాత అంతటి భారీ వర్షాలు పడుతున్నాయని ఆయన అన్నారు. నగర చరిత్రలో ఇది ఒక వైపరీత్యం అని ఆయన అన్నారు. దీంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అన్నారు.

ఇంత పెద్ద ఉపద్రవం చోటుచేసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి జాతీయ విపత్తుగా ప్రకటించకుండా  నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి తెలంగాణ పై వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. వందల కుటుంబాలు ముంపుకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయింది అని ఆయన విమర్శించారు. కేంద్ర ఇవ్వాల్సిన బడ్జెట్ ను ఇవ్వకపోగా యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ  దాట వేస్తున్నారు‌ అని మండిపడ్డారు. ఇక వీరు ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుని భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: