ఒక వైపు కరోనా ప్రభావం కొనసాగుతుంది. మరో వైపు దోపిడీలు, దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరి బాధ వాడిది అన్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి.ప్రస్తుత రోజుల్లో మన నీడను మనం నమ్మలేము.. అంతగా మోసాలు, నేరాలు జరుగుతున్నాయి. నేరాలకు పాల్పడే వాళ్ళు ఇప్పుడు కొత్త రూటును ఎంచుకుంటున్నారు.. అధికారుల వేషాలతో ఇళ్లలోకి వచ్చి అదును చూసి భారీ దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటన లు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..



ఇప్పుడు మరో మోసం వెలుగులోకి వచ్చింది.. ఇల్లు కొనడానికి వెళ్లి నగలను దోచుకెళ్లారు...ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. కృష్ణ జిల్లా గుడివాడ లో ఓ అనుమాషం జరిగింది. టీచర్స్ కాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది..హెల్మెట్ పెట్టుకొని ఓ మహిళ ఇంటికి వచ్చారు.. అక్కడ ఓ మాల్ ఉందని తెలుసుకొని అక్కడకు వచ్చారు.ఇల్లు అమ్ముతామన్నారని అడుగుతూ లోపలికి ప్రవేశించాడు. ఇల్లు మొత్తం కలియదిరుగుతూ నీళ్ల ట్యాప్‌లు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పాడు. సింక్‌ని పరిశీలించిన రత్నకుమారి బాగానే పనిచేస్తోందని చెబుతుండగానే దుండగుడు ఆమె మెడ పట్టుకుని ఒంటిపై బంగారం మొత్తం ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.



ఆమె భయంతో వణికిపోయి ఒంటిమీద ఉన్న బంగారాన్ని మొత్తాన్ని ఇచ్చేసింది. ఆ తర్వాత ఆమె మెడలోని చైన్‌ ఇచ్చేయాలంటూ జేబులో నుంచి తుపాకీ తీసి ఆమె తలకి గురిపెట్టాడు. భయంతో చైన్ ఇచ్చేసిన వెంటనే ఆమెను బాత్రూమ్‌లోకి నెట్టేసి తలుపు వేసి బయటికి పారిపోయాడు. రత్నకుమారి తేరుకుని బాత్రూమ్‌ రెండో తలుపు తీసుకుని వచ్చేసరికే దుండగుడు పరారయ్యాడు..ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పింది. తుపాకీ కూడా ఉందని చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. గుడివాడలో గన్ కల్చర్‌పై పోలీసులు కాస్త ఎక్కువగా ఫోకస్ చేశారు. నిందితుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: