కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు ఉన్నారా? అని అయన నిలదీశారు. సీఎం చెప్పినట్లు రైతులు పత్తి వేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. రైతులు లక్షల రూపాల పెట్టుబడులు పెట్టి.. వర్షాలకు పంట నష్టపోయారు అని ఆయన అన్నారు. సీఎం నుండి రైతులను ఆదుకుంటామని ఒక్క మాట కూడా రాలేదు అని ఆయన మండిపడ్డారు. సీఎస్ పంట నష్టపోతుంటే ధరణి మీద రివ్యూ చేశారని ఆయన విమర్శించారు.

ఇదేనా పరిపాలనా...? అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో ధరణి మీద సమీక్ష అవసరమా అని నిలదీశారు. ప్రజల ఆస్తులు తెలుసుకోవడం అవసరమా అని మండిపడ్డారు. వర్షాలకు ఇండ్లు దెబ్బతింటే ఇండ్లు కట్టిస్తా అన్నారు అన్న ఆయన... ఇప్పుడేమో 10వేలు,50 వేలు లక్ష రూపాలు ఇస్తా అంటున్నారని, ఆ డబ్బులు ఎలా సరిపోతాయి అని ప్రశ్నించారు. 5 లక్షల రూపాల ఇల్లు దెబ్బతింటే లక్ష ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. 550 కోట్లు సరిపోవు అని అన్నారు. మరి రైతుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.

కేవలం జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే 550 కోట్లు విడుదల చేసారు తప్ప ప్రజల మీద ప్రేమ లేదు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు  మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. రైతులను వెంటనే ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు. హైదరాబాద్ కు 10వేల కోట్లు కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరిని అదుకోవాలంటే లక్ష కోట్లు కావాలన్నారు. రైతులను,ప్రజలను అదుకోకపోతే రోడ్ల పైకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సౌత్ ఇండియా లోనే మెగా krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి ధనవంతుడని అన్నారు. 10 కోట్లు కాదు రాష్ట్రాన్ని దత్తత తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు. ఎవరు దగ్గర డబ్బులు ఉన్నాయని విరాళాలు అడుగుతున్నాయని ప్రశ్నించారు. రైతులను ప్రజలను అదుకోకపోతె ప్రకృతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతుందని యన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: