కరోనా వేట ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంచు మించు అన్ని దేశాలూ కరోనా కాటుకు బలైనవే. వివిధ దేశాలు ఇప్పటికే టీకాను కనిపెట్టే పనిలో బిజీ అవ్వగా మరికొన్ని దేశాలు సదరు టీకాల దిగుమతి కోసం కాసుకు కూర్చున్నాయి. దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా రెచ్చిపోతోంది. కాగా, ఇలాంటి సందర్భంలో భారత దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజాగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అనేక విషయాలను ప్రస్తావించింది. కొత్తగా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు త‌గ్గుతూ వస్తోందని, అదే క్రమంలో రోజువారీ రిక‌వ‌రీల సంఖ్య కూడా పెరుగుతున్న‌ద‌ని ప్రకటించింది. అందువలన క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి అయినటువంటి రాజేష్ భూష‌ణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఈయన ఓ శుభవార్త చెప్పారు.

అదేమిటంటే, క‌రోనా కేసుల రికవరీస్ ప‌రంగా ఇండియా ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. అలాగే క‌రోనా ప‌రీక్ష‌ల ప‌రంగా చూసుకుంటే మాత్రం అమెరికా త‌ర్వాత భారత్ 2వ స్థానంలో ఉన్న‌ద‌ని  పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు మన దగ్గర క‌రోనా మ‌హమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 67 ల‌క్ష‌లు కాగా.. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య మాత్రం 9.6 కోట్లు దాటడం గమనార్హం.

ఇకపోతే, 9.6 కోట్ల శాంపిల్స్‌లో కేవలం 7.90 శాంపిల్స్‌లో మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే, ప్ర‌స్తుతం ఉన్న మొత్తం కరోనా యాక్టివ్ కేసులలో 64 శాతం కేసులు కేవ‌లం 6 రాష్ట్రాల్లోనే వుండటం కొసమెరుపు. అవి వరుసగా... మ‌హా రాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తిమిళ‌నాడు, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, మరియు ప‌శ్చిమ‌ బెంగాల్. మిగిలిన దేశాలలో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: