దుబ్బాక బాలాజీ ఫంక్షన్ హాలులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తి గత వేధింపులకు గురి చేస్తోంది అని ఆయన విమర్శించారు. నిన్న వాహనం తనిఖీ చేయడానికి పది మంది సిఐ, పది మంది ఎస్సైలు, ముగ్గురు ఎసిపి లు 150 మంది పోలీస్ బందోబస్తు మధ్య తనిఖీ చేసారని అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు సమాచారం తో ఉదయం నుండి రాత్రి - రాత్రి నుండి ఉదయం వరకు రాత్రంతా పోలీస్ డ్రామా చూపించారని ఆయన విమర్శించారు.

సుమారు రెండు వందల పోలీసులతో వాహనం తనిఖీ చేయడం కేవలం కుట్ర మాత్రమే అని ఆయన విమర్శించారు.  నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈరోజు తెల్లవారి ఐదు గంటల వరకు తనిఖీ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. పోలీసులను వివరణ కోరితే సరైన సమాధానం లేదు అని  ఆగ్రహం వ్యక్తం చేసారు. మా బిజెపి వాహనంలో డబ్బులు పెట్టి కేసులు పెట్టె కుట్ర ప్రభుత్వం చేస్తుంది అని విమర్శించారు. మమ్మల్ని వ్యక్తి గతంగా టార్గెట్ చేస్తుండు మంత్రి హరీష్ రావు అని ఆయన విమర్శించారు.

2014 ఆగస్టు నుండి ఇవ్వాల్లటికి దుబ్బాక కు ఎన్ని నిధులు ఇచ్చారో మంత్రి చెప్పాలి అని సవాల్ చేసారు. బిజెపి గెలిసిన దగ్గర 2 రూపాయలు ఫెన్షన్ వస్తుందని నిరూపిస్తవా? హరీష్ రావు కు సవాల్ చేసారు. దుబ్బాక లో టౌన్ హాల్ కు మూడు కోట్లు ఇచ్చినట్టు సమాచార హక్కు చట్టం కింద మీ అధికారులే ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. బిజెపి గెలిస్తే పింఛన్లు రావనడం నిరూపించాలి అని సవాల్ చేసారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ఒక నాణానికి బొమ్మ బొడుసు లాంటివే అని ఆయన విమర్శించారు. మాపై తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా బాజాపా ను ఎదురించలేరు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: