రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అసలు ఎప్పుడు ఆర్టీసి బస్సులు మొదలవుతాయి అనే విషయంలో స్పష్టత రావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది రవాణా పూర్తి స్థాయిలో లేకపోవడంతో. దీనిపై అధికారులు చర్చలు జరిపినా సరే ఇప్పటి వరకు కూడా ఎక్కడా ముందు అడుగు పడలేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా జనసేన పి.ఎ.సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. దసరాకి తెలంగాణ నుంచి ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ప్రాంతం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి   ఏపీకి రావాలనుకొనే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన ఆవేధన వ్యక్తం చేసారు. కనీసం దసరా నాటికైనా బస్సులు తిరిగితే సొంత ఊళ్ళకు రావాలనుకున్నవారికి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరాశ కలిగించింది అని అయన అన్నారు. అదే విధంగా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకొన్నవారికి రవాణా సదుపాయం లేకుండా పోయింది అని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పారు.

లాక్డౌన్ కి ముందు రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 1281 బస్సులు నడిచేవి అని ఆయన చెప్పారు. కిలోమీటర్ల లెక్కలు తేలలేదు కాబట్టి బస్సులు నడపలేము అనేది సంతృప్తికరమైన సమాధానం కాదని ప్రభుత్వం గుర్తించాలి అని ఆయన సూచించారు. దసరా సమయంలోనైనా ఊరు వెళ్ళాలి అనుకొన్నవారు నిరాశలో ఉన్నారు అని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో టికెట్ ధరలపై నియంత్రణ లేదు అని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే ప్రత్యేక దృష్టిపెట్టి చర్చించకపోతే సంక్రాంతికి కూడా సమస్య పరిష్కారం కాబోదన్నారు. ప్రజల ప్రయోజనాలను కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: