అమరావతి: తాను పవిత్రమైన పునాదుల మీద నిలిచినట్లుగా తనకు తానుగా భావిస్తున్న భ్రమల నుంచి భారత న్యాయవ్యవస్థ బయటకు రావాల్సిన సమయం వచ్చింది. ఈ నిజాన్ని చెప్పడం వల్ల మన ప్రజాస్వామ్యం అంతమైపోదు. పైగా అది ప్రజాస్వామ్య పునాదులను బలంగా నిలపగలుగుతుంది. రాజ్యాంగంలోని విభాగాల్లో ప్రజలకు అత్యంత తక్కువగా ప్రాతినిథ్యం వహిస్తున్న న్యాయవ్యవస్థ తనలోని లోటుపాట్లపై ఇకనైనా తనిఖీకి, దర్యాప్తుకు అవకాశం ఇవ్వడం ద్వారానే మన ప్రజాస్వామ్యం గుబాళిస్తుంది అంటూ ఇటీవల ఆర్తీ రాఘవన్ అనే బాంబే హైకోర్టు న్యాయవాది వ్యక్తం చేసిన అభిప్రాయాలు. ప్రజల జీవితాలను ఇంతలా ప్రభావితం చేస్తున్న న్యాయవ్యవస్థ నేతిమీద కాయలా తయారైందన్న సందేహాలు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హైకోర్టులలో, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల చెడు ప్రవర్తనపై స్వతంత్ర దర్యాప్తుకు ఏర్పాట్లు లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదులు వస్తే వారంతట వారే తమ న్యాయమూర్తులు విచారణ చేసుకుంటున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ భువాయ్ పై లైంగిక వేధింపుల విచారణకు వచ్చినప్పుడు ఇదే పద్దతిని అనుసరించారు. మమా అనిపించి ఆయనను ఆరోపణల నుంచి బయటకు లాగేశారు. ఒకవేళ  న్యాయమూర్తి తప్పు చేశారని తేలినా.. పార్లమెంట్ లో అభిశంసన ద్వారానే వారిని తొలగించాలి. భారత్ లో ఇప్పటివరకు అభిశంసన చేసిన సందర్భం లేదు. ఏ వ్యవస్థపైన అయినా ప్రజల్లో గౌరవం ఏర్పడాలంటే.. ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తుల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది న్యాయవ్యవస్థకే కాకుండా పాలనా వ్యవస్థకు, శాసన, మీడియా వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. ఈ నాలుగు రంగాల్లో పనిచేసే వ్యక్తుల వ్యక్తిత్వ ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఏపీలో జగన్ హైకోర్టు న్యాయమూర్తుల్లో కొందరు, సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి తమ పదవులకు వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించడం లేదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు ఫిర్యాదు చేయకముందే న్యాయ కోవిదులు ఎందరో ఈ అంశాలపై వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ ధోరణి నాగరిక ప్రవర్తనకు దూరంగా ఉందని న్యాయవాది క్రిష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రిష్ణయ్య ఈ మాటలు న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేయడానికి అనలేదు.. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి గుణాత్మకమైన మార్పులను కోరుతూ ఆయన ఈ మాటలు అన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ ను కోర్టులు నానా అగచాట్లకు గురిచేశాయి. ఇప్పుడు జగన్ ను కూడా అలానే చేస్తున్నాయి. చాలా రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు మారాలని కోరుతున్న జగన్ రాసిన లేఖను న్యాయవ్యవస్థ సానుకూలంగా స్పందించి ఆయన ప్రభుత్వానికి కల్పిస్తున్న అడ్డంకులను తొలగించడం సమంజసంగా ఉంటుంది. సమాజంలోని కొన్ని దుష్ట శక్తులు తమ స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంటున్న మాట నిజమే. అయితే విమర్శలకు తావులేని స్థాయిలో న్యాయమూర్తలు ప్రవర్తన ఉంటే ఆ దుష్టశక్తులు తోక ముడుచుకుని వాటంతట అవే పోతాయి. ప్రజలు ధర్మమార్గాన్ని అనుసరిస్తున్న కోర్టులకు, న్యాయమూర్తులకు పూర్తి రక్షణగా నిలుస్తారు. లేకపోతే కోర్టులలో న్యాయమూర్తులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: