కరోనా బూచి పిల్లల చదువులను నాశనం చేసింది. దాదాపు 7 నెలలుగా పిల్లలు చదువుల్లేక పూర్తిగా ఆటలకు బానిసలు అయిపోయారు. ఈ క్రమంలో అనేకమంది పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి సరిగ్గా తిండి కూడా తినడం లేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మాటలను వినక తమకు తోచింది తాము చేస్తూ... సదరు తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు. ఈ కోవలో అనేక మంది పిల్లల మానసిక స్థితి కూడా ఏమి బాలేదని సర్వేలు చెబుతున్నాయి.

ఇక ఆన్లైన్ గేమ్స్ ఉండనే వున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమాని ఆన్లైన్ గేమ్స్ కు మంచి డిమాండ్ పెరిగింది. పిల్లలు ఆయా గేమ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. సదరు సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీలు మాత్రం సొమ్ము పోగు చేసుకుంటున్నాయి. దాదాపు 7 నెలలుగా పిల్లల తల్లిదండ్రులు స్కూల్స్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈరోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు మఖ్య మంత్రి ప్రకటించారు. విడతల వారీగా అంటే 1, 3, 5, 7 తరగతులకు ఒకరోజు; 2,4,6,8 తరగతులకు మరో రోజు క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

2 రోజులకు ఒకసారి మాత్రమే క్లాసులు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మాత్రం 2 రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో ఇది మొదలయ్యి, డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: