అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసిన నాటి నుంచి దేశం మొత్తం ఆయనపైనే ఫోకస్ పెట్టింది. ఈ ఒక్క లేఖతో జగన్ పేరు దేశం మొత్తం వినపడుతోంది. ఇచ్చిన మాట గురించి, అది నేరవేర్చడం కోసం జగన్ పడే తాపత్రయం, ప్రజా సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన గురించి ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆయనను ఏపీ ప్రజలు హీరోలా చూస్తారు. ఇప్పుడు ఏపీ ప్రజలతో పాటు దేశం మొత్తం జగన్ ను హీరోలా చూస్తోంది. దానికి కారణం.. న్యాయవ్యవస్థలో పక్షపాతంగా తీర్పులు వస్తున్నాయని తెలిసిన వెంటనే.. బహిరంగంగా వాటిపై విమర్శలు చేస్తూ ఆయన లేఖలు రాయడం దేశంలో ప్రకంపనలు రేగాయి. జగన్ లేవనెత్తిన అంశాలపై అనేక మంది మాజీ జడ్జీలు మాట్లాడుతూ.. కచ్చితంగా వీటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెబుతూ జగన్ వాదనను బలపర్చారు. ఇదే సమయంలో కొంతమంది పచ్చ కామెర్లు వాళ్లు.. జగన్ తన కేసుల విషయంలో భయపడుతూ జడ్జీల మీద అపవాదులు వేస్తున్నారంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోయిన కష్టాల్లో ఉన్న జగన్ ను ఒకవైపు సోనియా గాంధీ, మరోవైపు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయలేదు. అక్రమ కేసులు పెట్టించి 16 నెలలు జైలుకు పంపినా బెదరలేదు. లక్ష కోట్లు అంటూ అసెంబ్లీలో అవమానించినా సహనం కోల్పోలేదు.

అలాంటి డైనమిక్ లీడర్‌కు కొత్తగా కేసుల విషయంలో భయపడే అవసరం ఏముంది. ఇప్పటికిప్పుడు జగన్ బీజేపీతో పొత్తుకు సిద్దమైతే తనమీద ఉన్న కేసులు గాలికి కొట్టుకుపోవడానికి నిమిషం పట్టదు. ఇదే కేసులు చంద్రబాబు మీద ఉంటే బీజేపీ మోచేతి నీళ్లు తాగుతూ వాటిపై స్టే తెచ్చుకుంటూ వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ బయట పడేవారు. కానీ.. జగన్ అలాంటి వారు కాదు.. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్న మనిషి. అందుకే తనమీద ఉన్న కేసుల విషయంలో స్టే కోసం దొడ్డిదారులు తొక్కలేదు. జగన్ మీద అక్కసుతో తప్పుడు వార్తలు రాస్తూ జగన్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండా.. రెండు, మూడు ప్రధాన మీడియా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. జాతీయ మీడియాలో మాత్రం జగన్ చేసే ప్రతి పనికి అద్భుతమైన కవరేజీ ఇస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జగన్ ఒక హీరో. అందులో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖతో దేశం మొత్తం జగన్ వైపు తిరిగింది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారని ప్రతిఒక్కరు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆయన రాసిన లేఖపై చర్చ జరగాల్సిందేనంటూ అనేక మంది సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు సైతం చెబుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: