అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పది నుంచి 30 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందంటూ ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీసెర్చ్ చెప్పిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఓ హడావిడి చేస్తున్నారు. అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి అయ్యి న్యాయవ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇటు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నా.. ఇలాంటి రాక్షస పాలనను రాష్ట్రం ఎప్పుడూ చూడలేదని వాపోయారు. దీనికి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్మాదులు స్వైరవిహారం చేస్తున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. శాంతిభద్రతలు లోపిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయవాడలో జరిగిన యువతిపై దాడే ఉదాహరణ అని అన్నారు. అయితే బాబుగారిది రెండు నాలుకల ధోరణి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే గతంలోనూ చంద్రబాబు వైఎస్సార్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో, దేశంలో ఏ మూలనా అమలు కాని గొప్ప సంక్షేమ పథకాలను ఏపీలో అమలుపర్చారు.

ఇందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర పథకాలు రాజశేఖర్ రెడ్డి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆయన మరణానంతరం ప్రజలు వైఎస్సార్ ను దేవుడిలా గుర్తించారు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్సార్ పై విమర్శలు చేస్తూనే వచ్చారు. అదే విధంగా ప్రధాని మోదీని కూడా చంద్రబాబు అనేక సార్లు విమర్శించారు. బాబు గారికి అనుకూలంగా ఉంటే మంచి పాలన అందించారని.. వ్యతిరేకంగా ఉంటే అరాచక పాలన రాజ్యమేలుతుందని విమర్శలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. వైసీపీ నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోమారు రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని జగన్ పాలన మూడేళ్లేనని అంటున్నారు. ఇప్పుడేమో జగన్ కు 30 ఏళ్ల శిక్ష అని కహానీలు చెబుతున్నారు. అయితే ఇలా జరిగే అవకాశాలే లేవని.. జగన్ కేసులు జరిమానాలతోనే పూర్తి అయిపోతాయని, జరిమానా విధిస్తూనే ఫైనల్ తీర్పు రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: