దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు అనగానే చాలామంది చాలా రకాలుగా ఊహించుకున్నారు. ప్రధాని ప్రసంగం లో ప్యాకేజీ ఉంటుందని అదేవిధంగా లాక్ డౌన్ పై ప్రకటన ఉంటుందని చాలామంది ఆశించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం చాలా చప్పగా తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఎక్కడా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రకటన కానీ  కరోనా వ్యాధికి సంబంధించిన ప్రకటన కానీ దేశంలో కరోనా నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి కానీ ఏ ఒక్క అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

అంతే కాకుండా దేశంలో వరదలు పరిస్థితి గురించి కూడా ఆయన మాట్లాడలేదు. పలు రాష్ట్రాల్లో వరదలు తీవ్రస్థాయిలో చుక్కలు చూపిస్తున్నాయి. అయినా సరే ఆ వరదల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలతో చుక్కలు చూస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఆయన ఆయన ప్రకటించే అవకాశం ఉందని అందరూ భావించారు. అయినా సరే దానికి సంబంధించి మోడీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

దీనితో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. వరదలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా నిధులను ప్రకటిస్తారు ఏమో అని అందరూ ఎదురు చూశారు. దానికి సంబంధించి కూడా ఏ విధమైన ప్రకటన రాకపోవడంతో అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. రాజకీయ పరిశీలకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేకతా లేదు అని... సాధారణ ప్రసంగం మాదిరిగానే మోడీ ప్రసంగం ఉంది గాని... దాంట్లో ఎలాంటి ప్రత్యేకత లేదని దాని గురించి ఉదయం నుంచి ఎన్నో ప్రచారాలు ఉన్నాయని మండిపడుతున్నారు. టైం వేస్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: