ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి పదవుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా ఇప్పుడు పదవులు ప్రకటన అనేది చేసింది అని చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్లడానికి ఈ పదవులు ప్రకటన విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించారు. ఎక్కువగా బీసీ సామాజిక వర్గాలకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలు విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన తీరు విమర్శలకు వేదికగా మారింది. అన్ని సామాజిక వర్గాలను ముందుండి నడిపించిన ఆయన... తన సామాజిక వర్గానికి ఇచ్చే విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. పదవుల కోసం ఎదురు చూసిన చాలా మంది నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అటు రాయలసీమలో ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు కూడా చాలా ఆశగా ఎదురుచూశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు వారి విషయంలో అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీని ముందు నుంచి మోసే వాళ్ళకు కూడా పదవులను ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమా అఖిలప్రియ అదేవిధంగా పులివర్తి నాని వంటి వారికి పదవులను ప్రకటించే విషయంలో చంద్రబాబు నాయుడు వెనకడుగు వేశారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలా మంది నేతలు ఇప్పుడు చంద్రబాబు పై సీరియస్ గా ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలను ఆయన పక్కన పెట్టారు. ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా చాలా మంది నేతలను ఆయన పక్కన పెట్టడం తో ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్త మవుతోంది. మరి భవిష్యత్తులో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: