గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అయితే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో కొంతమంది నేతల నుంచి సహకారం లేదు అనే భావన ఇప్పుడు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఒక ప్రత్యేక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నారు. నేతలను నమ్ముకుంటే అయ్యేపని కాదు కాబట్టి ఆయనే స్వయంగా హైదరాబాద్ మొత్తం పర్యటన చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు వర్షాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నాయి.

దీనితో ఒకరి మీద నమ్మకం పెట్టుకుని ప్రజల్లోకి వెళితే మంచిది  కాదు అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. దాదాపుగా 10 నియోజకవర్గాల్లో రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా తిరుగుతున్నారు. త్వరలోనే మరిన్ని నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా వెళ్లే విధంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దాదాపుగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను పక్కనపెట్టి...

ఇతర నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే బిజెపి ఇబ్బందిపెట్టే అవకాశం ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కేటీఆర్ చాలావరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అటు కేసీఆర్ కూడా కేటీఆర్ కి కొన్ని సూచనలు చేశారట. హైదరాబాదులో ఎవరైతే పని చేయని నేతలు ఉంటారో వారిని పదవి నుంచి తప్పించాలని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటిఅర్ కి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. త్వరలోనే కొంతమంది నేతలపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేటు పడే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అటు మంత్రుల విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: