అందరూ ముందు నుంచి ఊహించినట్టుగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నియామకం పూర్తి అయపోయింది. ఇక ఆయన వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయడం ఒక్కటే మిగిలి ఉంది. గత నుంచి ఆయన ట్రాక్ రికార్డు చూస్తే, వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, అసెంబ్లీలోనూ, బయటా, ఆ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజీ తీసుకురావడంతో పాటు, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను అచ్చెన్న పెంచుకో గలిగారు. అయితే అచ్చెన్నాయుడు నియామకంపై టీడీపీ యువనేత, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ అభ్యంతరాలు చెప్పడం, ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, తన ప్రభావం పెద్దగా తెలుగుదేశం పార్టీలో ఉండదు అని, లోకేష్ ఇలా ఎన్నో ఊహాగానాలు వినిపించినా చంద్రబాబు మాత్రం అచ్చెన్న వైపే మొగ్గు చూపారు.


అయితే అసలు అచ్చెన్నకు అధ్యక్ష పదవి రావడానికి ఇప్పుడు జగన్ కారణం అయ్యారు అంటూ, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కారణం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. ఎందుకంటే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని,ఏపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయించింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అచ్చెన్న తెలుగుదేశం పార్టీపై ఎవరు విమర్శలు చేసినా ఊరుకునే వారు కాదు. దీంతో టీడీపీలో మరో గొంతు తమకు వ్యతిరేకంగా ఉండకుండా ఉండాలంటే, అచ్చెన్న ను అరెస్టు చేయకుండా మిగతా టీడీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేయాలని జగన్ భావించినా, అది ఇప్పుడు అచ్చెన్నకు మేలు చేసినట్లుగానే కనిపిస్తోంది.


అలాగే వైసిపి నాయకులు ఆయనపై పదే పదే విమర్శలు చేస్తూ ఉండటం వంటివి బాగా కలిసి వచ్చాయి. చంద్రబాబు తర్వాత అచ్చెన్న మాత్రమే తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించగల సమర్ధుడు అని చంద్రబాబుతో పాటు, టిడిపి  శ్రేణులంతా నమ్మారు. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న బాధ్యతలు స్వీకరించడానికి ఆయనకు ఈ స్థాయిలో పాపులారిటీ రావడానికి, పరోక్షంగా జగన్ కారణం అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్ కు బాగా రుణపడి పడిపోయారు అచ్చెన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: