అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ అక్కడి రైతులు 300 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమం రోజులు పెరుగుతున్నాయి తప్ప.. అది ఫలించే అవకాశాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. అమరావతి రైతులు రోజూ వస్తున్నారు.. టెంట్లలో కూర్చుని నినాదాలు చేస్తున్నారు.. కానీ ఫలితం ఉండటం లేదు. టీడీపీ అనుకూల వర్గం మీడియా కాస్త ఈ ఉద్యమాన్ని కవర్ చేస్తూ ఇంకా బతికిస్తుందనే చెప్పాలి. కానీ వైసీపీ మీడియా మాత్రం ఇదంతా మాచ్ ఫిక్సింగ్ ఉద్యమంగా ప్రచారం చేస్తోంది. మొత్తం మీద ఇలాగే సాగితే ఈ ఉద్యమం 300 రోజులే కాదు.. 500 రోజులైనా పెద్దగా ఉపయోగం కనిపించదు.

మరి ఈ ఉద్యమం ఫలించాలంటే ఏంచేయాలి.. ఇందుకు పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ చూపించిన మార్గమే కరెక్టు అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు కాని, ఆయన పార్టీవారు కాని ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దపడితేనే రాజధాని ఉద్యమానికి ఊపు వస్తుందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు కానీ.. టీడీపీ కానీ ఆ పని చేసే ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు ఓ సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చూసి అంతా నవ్వుకున్నారు.

ఎందుకంటే.. ఎక్కడైనా ఉద్యమకారులే రాజీనామాలు  చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నవారు రాజీనామాలు చేయరు.. తెలంగాణ ఉద్యమ నేతగా కెసిఆర్ ఎన్నిసార్లు రాజీనామా చేశారో తెలుసు కదా. ఇప్పుడు టీడీపీకి కూడా ఆ ఆప్షన్ ఉంది. కానీ దాన్ని ఉపయోగించే సాహసం చేయడం లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న టిడిపి నేత గద్దె రామ్మోహన్ తో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల బరిలో దిగొచ్చు. అలా రాజీనామాలు చేయకుండా రోజూ నాలుగైదు గ్రామాలలో టెంట్లు వేయించి నిరసనలు చేయిస్తే ఫలితం తేలే అవకాశమే కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: