తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ ఉంటారు కొంత మంది నేతలు. వారిలో ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు మీడియాలో ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఆయన అధికార పార్టీని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయడం మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. అధికారపార్టీ ఆయన చేస్తున్న అవినీతి ఆరోపణలతో కాస్త ఉక్కిరిబిక్కిరవుతోంది అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అయ్యన్నపాత్రుడు మీద కొంతమంది సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు.

ఆయనకు చంద్రబాబునాయుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కళావెంకట్రావు లాంటి నేతలు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్న సరే వాటిని పెద్దగా చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదని కేవలం అయ్యన్న లాంటి నేతలు చేస్తున్న విమర్శలకు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతమంది అసహనంగా ఉన్నారు. ప్రధానంగా దీపక్ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఇప్పుడు సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది.

దీపక్ రెడ్డి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. తన కుటుంబాన్ని అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్న సరే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని వీడటం లేదు. ఆయనకు భారీగా ఆఫర్లు ఇచ్చారని ప్రచారం కూడా ఆ మధ్యకాలంలో ఎక్కువగా జరిగింది. అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి మాత్రం ఆయనకు సహాయ సహకారాలు అందలేదు. దీనితో దీపక్ రెడ్డి కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు. తాజాగా ఆయనకు జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. అయ్యన్నకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో విశాఖ జిల్లా నేతలు కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మీడియాతో మాట్లాడక పోవడానికి ప్రధాన కారణం అదే అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: