ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ఇప్పుడు రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు ముఖ్యంగా మాజీ మంత్రులు మంత్రులు కొంతమంది నుంచి సహాయ సహకారాలు లేవు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. మాజీ మంత్రులు కొంత మంది పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కోసం మాట్లాడటానికి పెద్దగా ముందుకు రావటం లేదు. దీనితో చంద్రబాబు నాయుడు వారి మీద చాలా సీరియస్ గా ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇప్పుడు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ మిగిలిన నేతలు ఎవరూ కూడా మీడియాతో మాట్లాడటం లేదు. ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటంలేదు. దీనితో ఆయన పై చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయి. ఆయనతో పాటుగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయలేక పోతున్నారు. అలాగే పీలేరు నియోజకవర్గానికి చెందిన kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విషయంలో కూడా ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే కొంత మంది నేతలతో ఆయన నేరుగా చర్చలు జరిపారు. అయితే పార్టీలో ఎవరైనా ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్లిపోవచ్చని చంద్రబాబు నాయుడు మొహం మీద చెప్తున్నట్లుగా సమాచారం. ఈ వ్యాఖ్యలు కాస్త కొంత మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే పార్టీలో ఉండి పార్టీ కోసం పని చేయని నేతలు తనకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు కొంతమందికి లేఖ కూడా రాస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇటీవల కొంతమంది నేతలు పార్టీలో క్రియాశీలకంగా పని చేయకపోతే మాత్రం తాను ఉపేక్షించేది లేదని ఎవరైనా సరే బయటికి వెళ్ళవచ్చు అని చంద్రబాబునాయుడు చెబుతున్నారట. దీనితో కొంతమంది నేతలు కూడా ఇప్పుడు బయటకు రావాలని లేదా ఇతర పార్టీ లోకి వెళ్ళాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: