బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి అంటే ఆ పార్టీకి ఇప్పుడు చాలా వరకు కష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవి పెద్దగా ఫలించలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా బీహార్ లో ఉన్న పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అక్కడ సీఎం నితీష్ కుమార్ కూడా కాస్త బలం గానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇప్పుడు బలపడాలి అంటే మాత్రం కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు  ప్రచారం కూడా జనతాపార్టీ చేసుకోలేక పోతుంది. దానికి ప్రధాన కారణం కరోనా వైరస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది బాలీవుడ్ స్టార్ హీరో లను తమ వైపు తిప్పుకునే విధంగా బీజేపీ పెద్దలు ఉన్నారు. వారి ద్వారా కొంత సోషల్ మీడియాలో ప్రచారం చేయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుగా బాలీవుడ్ హీరోలతో ప్రచారం చేయిస్తే బాగుంటుందని తద్వారా చేసిన వాటిని కూడా వారి ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు.

అయితే  ఇది ఫలిస్తుంది అనేది చెప్పడం కాస్త కష్టమే. అయినా సరే బిజెపి మాత్రం వారిని వాడుకోవాలని భావిస్తుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. దీంతో బాలీవుడ్ హీరోల ను ఒక వారం పది రోజుల పాటు ప్రచారానికి వాడుకునే విధంగా బీజేపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు కూడా ఇప్పుడు బిజెపి పెద్దలకు ఇదే విషయం చెప్పినట్లుగా సమాచారం. మరి  బిజెపి అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: