ఇటీవల కురిసిన భారీ వర్షాని కి హైదరాబాద్ నగరం మొత్తం తడిసి ముద్దైన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. నగరం మొత్తం జలదిగ్బంధం లో వెళ్లిపోవడం తో లోతట్టు ప్రాంతాలు సాధారణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పూర్తిగా రహదారులన్నీ పెద్ద పెద్ద చెరువుల ను తలపించడం తో పాటు.. నగరంలోని పలు ప్రాంతాలు అన్నీ జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయాయి.  ఈ క్రమం లోనే భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ నాళాలు  పొంగి  మురికి నీరు ఇళ్లలోకి చేరడం తో ప్రజలు దుర్వాసన మధ్య  నరకం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది.



 ఇక ఎటు చూసినా భారీగా వరద నీరు ఉండడం తో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడిపోయారు నగరవాసులు. కనీసం భారీ వరదల కారణం గా ఎటు వెళ్తే ప్రాణం పోతుందేమో అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెల్ల తీశారు. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి అధికారులు అందరూ వరదల నుంచి నగరానికి విముక్తి కలిగించేందుకు  కీలక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరదలకు కారణమైన అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులందరూ కసరత్తులు చేస్తున్నారు. అయితే కేవలం అక్రమకట్టడాల నే కాకుండా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను కూడా కూల్చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దైన శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఏ క్షణంలోనైనా కూలి ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఏకంగా హైదరాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరిన 65 భవనాలను కూల్చివేస్తున్నట్లు  అధికారులు ప్రకటించారు. ఇక శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో  నివసించే ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని వారికి కమ్యూనిటీ హాల్స్ లేదా తాత్కాలిక వసతి కల్పిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: