విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల అమరవీరుల దినోత్సవ పరేడ్ లో డీజీపీ గౌతం సవాంగ్ తో కలిసి సిఎం వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్.. అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల  సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న డిజిపి గౌతమ్ సవాంగ్ ఆ తర్వాత పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. హోం మంత్రి సుచరిత, మంత్రులు, మరియు పోలీస్ ఉన్నతాధికారులు కూడా పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి అని ఆయన అన్నారు. వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. సీఆర్పీఎఫ్ దళాలు భారతదేశాన్ని రక్షించడానికి పనిచేస్తారు ని ఆయన తెలిపారు. ప్రతీ సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తాం అని ఆయన అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారి త్యాగాలను గుర్తుంచుకోవడానికని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తారని అన్నారు.

మొత్తం పోలీసు దళాలు దేశ సేవ కోసం పని చేస్తున్నాయి అని ఆయన వివరించారు. కోవిడ్ వైరస్  విపత్తులో ముందుండి పనిచేసారు ప్రతీ పోలీసు అని ఆయన కొనియాడారు. అన్ లాక్ తరువాత కూడా వెనుకాడని ధైర్యంతో పనిచేసారు అని ఆయన తెలిపారు. సీఎం జగన్ మరణించిన పోలీసులకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు అని కీర్తించారు. భీమా సదుపాయం కల్పించడం కూడా మాకు అత్యుత్తమ‌ సదుపాయం అని ఆయన చెప్పారు. స్పందన చాలా ఉపయోగకరంగా మారింది అని ఆయన అన్నారు. మహిళా భద్రతకు వినూత్న విధానాలు తీసుకొచ్చాం అని డీజీపీ తెలిపారు. 87 పోలీసు సేవలతో కూడిన పోలీసు సేవా యాప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరం అని ఆయన అన్నారు. ఎలాంటి క్లిష్టమైన పరిస్ధితులైన ఏపీ పోలీసు ముందుంటారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: