భారీవర్షాలు భాగ్య నగరాన్ని ఎలా ముంచెత్తాయి అందరికి తెలిసిందే.. వర్షాల దెబ్బకు సిటీ మొత్తం సముద్రంలా మారగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు..నగరంలోని మూసి పరివాహక ప్రాంత వాసులు వరద నీటిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టినా వరద తీవ్రత మూలాన ఇప్పటికి పలు ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి వర్షాలు పోయి దాదాపు నాలుగు రోజులవుతున్నా ఇంకా ఆ ధాటికి ప్రజలు కోలుకోలేదంటే ఏ రేంజ్ లో వర్షం ప్రజలను ఇబ్బంది పెట్టిండు అర్థం చేసుకోవచ్చు..

ఇక దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వరద బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తుంది.. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంది . హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. పది కోట్ల సాయం ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం రూ. పదిహేను కోట్లను సాయంగా ప్రకటించింది. తెలంగాణకు వరదలు రావడం బాధాకరమని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి. కేసీఆర్ ఆయా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రాంతంలో రానున్న మూడు రోజులు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్న  నేపథ్యంలో అప్రమత్తం అయిన కేసీఆర్ ప్రభుత్వం వరద బాధిత ప్రాంతాలను వీలైనంత త్వరగా చేరుకునేందుకు వీలుగా స్పీడ్ బోట్లు అవసరం అని గ్రహించి వాటి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ను సాయం కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్ధన మేరకు వెంటనే సానుకూలంగా స్పందించిన ఏపి సీఎం జగన్,  తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు వారికి స్పీడ్ బోట్లను త్వరగా పంపించేలా చర్యలు తీసుకుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: