ఎంతలేదన్నా టీడీపీ కి భవిష్యత్ లో కాబోయే రారాజు. రేరాజు నారా లోకేష్ అని చెప్పాలి.. చంద్రబాబు అతన్ని నాయకుడిని చేయడం కోసం పడుతున్న కష్టం చూసైనా ప్రజలు లోకేష్ యాక్సెప్ట్ చేయాలి.. లోకేష్ రాజకీయం గా ఎప్పుడో ఎదగాలని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.. కానీ సరిగ్గా మాట్లాడడం కూడా రాని లోకేష్ ని ఎందుకంత బలవంతంగా జనాల మీద రుద్దుతున్నారని సొంత పార్టీ లోని నేతలే గుసగుసలాడుకుంటున్నారు.. చంద్రబాబు పని కూడా అలోమోస్ట్ అయిపోయే పరిస్థితి కి వచ్చింది..

దానికి తోడు ఇప్పుడు పార్టీ కూడా అంతంత మాత్రంగా నే ఉంది. దీంతో ఓ యువనాకుడు అయితే పార్టీ కి అవసరం ఉంది. అయితే ప్రత్యామ్నాయం లేని ఆ యువనాయకుడు లోకేష్ ఒక్కడే.. అందుకే లోకేష్ ని నాయకుడు గా తీర్చిదిద్దడానికి కష్టపడుతున్నారు.. చంద్రబాబు రాజకీయాలతో జనాలకు బోర్ కొట్టేసింది.. జగన్ లాంటి యంగ్ నాయకుడు లేటెస్ట్ యుక్తులతో రాజకీయాలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఇంకా ఎన్టీఆర్ టైమ్ రాజకీయాలను ఫాలో అవుతూ వారికి చిరాకు తెప్పోస్తున్నాడు.. ముఖ్యంగా యూత్ అయితే టీడీపీ రాజకీయాలను అస్సలు ఇష్టపడడం లేదు..

ఈ నేపథ్యంలో లోకేష్ ని ఎంత ప్రయత్నించినా టీడీపీ పగ్గాలు, రాష్ట్ర సారధిగా పనికొచ్చేలా లేడని చంద్రబాబు కు కూడా అర్థమైపోయింది.. చంద్రబాబు 71 ఏళ్లలో ఉన్నప్పుడే టీడీపీ సీనియర్‌ నేతలు నారా లోకేష్‌ను కనీసం తమ పార్టీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పడం లేదంటే.. బాబు తర్వాత నారా లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ ఏమిటో అర్థం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడే.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ భావి ప్రధాని రాహుల్‌ గాంధీ అని ప్రకటనలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే స్లోగన్‌ వినిపిస్తున్నారు. కనీసం ఇలాంటి ప్రయత్నం కూడా నారా లోకేష్‌ విషయంలో టీడీపీ నేతలు చేయకపోవడం విశేషంగానే చెప్పుకుంటున్నారు.బాబు ఉన్నంత వరకే తమకు టీడీపీలో భవిష్యత్‌ అని, ఆ తర్వాత టీడీపీ బండి లోకేష్‌ లాగడం కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్లు అచ్చెం నాయుడు ప్రకటనతో అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: