భారత్-చైనా సరిహద్దు లో ఉద్రిక్తత నేపథ్యంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న  విషయం తెలిసిందే. చైనా కు  వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలతో ప్రస్తుతం సంబంధాలు ఏర్పరచుకుంటుంది. చైనాను దెబ్బకొట్టేందుకు దౌత్య పరంగా రక్షణ పరంగా వాణిజ్య పరంగా కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది భారత్. ఈ క్రమంలోనే తైవాన్ తో  వాణిజ్య ఒప్పందానికి భారత్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తైవాన్ తో  వాణిజ్య ఒప్పందానికి తమను సంప్రదించాలని చైనా కోరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి తైవాన్ తమ భూభాగమే అంటూ  చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.



 అయితే ఎన్నో ఏళ్ల నుంచి తైవాన్ తమ దేశంలోని భూభాగమే అటు చైనా ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ తైవాన్ మాత్రం చైనా పాలనను  ఎప్పుడు ఈ కొడుతూ చీదరింపులు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ కూడా తైవాన్లో చైనా కు సంబంధించిన పాలన సాగలేదు. చిన్న దేశం అయిన ప్పటికీ చైనాను ఎదిరిస్తూ స్వయం పాలన కొనసాగుతుంది . తైవాన్ తమ దేశ భూభాగమే  అని ఆరోపిస్తున్న చైనా  ఇక సైనిక చర్యతో తైవాన్ ను  తమ దేశంలో కలుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవలె చైనా అధ్యక్షుడు యుద్ధానికి సిద్ధంకండి అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంపై 2018లో సంతకాలు చేసిన తర్వాత భారత్ తో స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందం కోసం కసరత్తులు చేస్తూ సంప్రదింపులు జరిపింది తైవాన్. ఇరు దేశాల మధ్య దాదాపు ఒప్పందం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఇక భారత్ తైవాన్ తో  వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో అటు చైనా వణికిపోతున్నట్లు  తెలుస్తుంది  ఈ క్రమంలోనే ఎలాగోలా ఒప్పందం జరగకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు చైనా తన అక్కసును వెల్లగక్కుతుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: